రాజు యాదవ్ ఓ ఎమోషనల్ రైడ్
ABN , Publish Date - May 24 , 2024 | 03:19 AM
టెలివిజన్ కామెడీ షో ‘జబర్ద్‌స్త’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గెటప్ శ్రీను. తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆయన.. మంచి కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మనుసులు గెలుచుకుని పాపులర్ కమెడియన్‌గా...

టెలివిజన్ కామెడీ షో ‘జబర్ద్‌స్త’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గెటప్ శ్రీను. తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆయన.. మంచి కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మనుసులు గెలుచుకుని పాపులర్ కమెడియన్‌గా మారారు. ఆయన తొలిసారి హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. కె.ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లేపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఫన్, ఎమోషనల్ రైడ్‌గా తెరకెక్కిన ‘రాజు యాదవ్’ ఈ రోజే విడుదలవుతున్న సందర్భంగా హీరో గెటప్ శ్రీను మీడియాతో ముచ్చటించారు.
‘‘దర్శకుడు నన్ను కలిసినప్పుడు మొదట నా పాత్ర గురించి చెప్పారు. భలే అనిపించింది. ఆ తర్వాత కథ వినగానే వెంటనే ఒప్పేసుకున్నా. ఈ కథను డైరెక్టర్ వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్నా.. క్యారెక్టర్ మాత్రం కల్పితమే. నేను ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో అత్యంత సవాల్‌తో కూడుకున్నది ఇదే. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం మామూలు విషయం కాదు. కొన్ని సందర్భాల్లో ఈ పాత్రలో వంద శాతం ఇవ్వలేనేమోనని.. ఒక ఆర్టి్‌స్టగా ఫెయిల్ అయిపోతానేమో అని అనుకున్న సందర్భాలూ ఉన్నాయి. అటువంటి సమయాల్లో దర్శకుడే నన్ను సపోర్ట్ చేశారు. ఈ సినిమాను దర్శకుడు కృష్ణమాచారి చాలా సహజంగా తెరకెక్కించారు. ప్రస్తుత తరం ప్రేక్షకులు రియలిస్టిక్ సినిమాలనే ఇష్టపడుతున్నారు. ఈ సినిమా కూడా సహజత్వం కోరుకునే ప్రేక్షకులందరికీ తప్పక నచ్చుతుంది’’ అని చెప్పారు.