రాజు యాదవ్‌ ఆట పాట..

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:39 AM

నటుడు గెటప్‌ శ్రీను హీరోగా నటిస్తున్న చిత్రం ‘రాజు యాదవ్‌’. కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కే ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్‌ కల్లేపల్లి నిర్మిస్తున్నారు...

రాజు యాదవ్‌ ఆట పాట..

నటుడు గెటప్‌ శ్రీను హీరోగా నటిస్తున్న చిత్రం ‘రాజు యాదవ్‌’. కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కే ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్‌ కల్లేపల్లి నిర్మిస్తున్నారు. మే 17న విడుదలవుతోంది. ఆదివారం చిత్రబృందం ‘దిస్‌ ఈజ్‌ మై దరిద్రం’ అంటూ సాగే గీతాన్ని సుడిగాలి సుధీర్‌ చేతుల మీదుగా విడుదల చేసింది. కాసర్ల శ్యామ్‌ సాహిత్యానికి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్వరాలు సమకూర్చారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, మంగ్లీ ఆలపించారు. లవ్‌ కామెడీతో పాటు హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు సినిమాలో ఉన్నాయని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిరామ్‌ ఉదయ్‌, ఎడిటర్‌: బొంతల నాగేశ్వర్‌రెడ్డి.

Updated Date - Apr 29 , 2024 | 06:39 AM