భావోద్వేగాలతో అలరించే రాజు యాదవ్‌

ABN , Publish Date - May 17 , 2024 | 02:29 AM

‘జబర్ధస్త్‌’ కమెడియన్‌ గెటప్‌ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్‌’. ఈ సినిమాతో కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు...

భావోద్వేగాలతో అలరించే రాజు యాదవ్‌

‘జబర్ధస్త్‌’ కమెడియన్‌ గెటప్‌ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్‌’. ఈ సినిమాతో కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్‌ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేస్తున్నారు. సక్సె్‌సపుల్‌ నిర్మాత బన్నీ వాసు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో సినిమాను రిలీజ్‌ చేస్తుండడం విశేషం. ‘మా సినిమా టీజర్‌, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సంగీత దర్శకుడు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ మంచి పాటలు అందించారు. లవ్‌, కామెడీ అంశాలతో పాటు హృదయాన్ని హత్తుకొనే భావోద్వేగాలతో సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు నిర్మాతలు. ఈ చిత్రంలో అంకిత ఖరత్‌ కథానాయికగా నటించారు.

Updated Date - May 17 , 2024 | 02:29 AM