మండీలో రాజ్‌తరుణ్‌

ABN, Publish Date - Jul 15 , 2024 | 02:53 AM

రాజ్‌తరుణ్‌ కోసమే న్యాయపోరాటం చేస్తున్నానని.. అవసరమైతే నిరాహార దీక్షకు కూడా వెనుకాడనని ఆయన మాజీ ప్రియురాలు లావణ్య ఆదివారం తెలిపారు. శనివారం లావణ్య స్టేట్‌మెంట్‌ను...

రాజ్‌తరుణ్‌ కోసమే న్యాయపోరాటం చేస్తున్నానని.. అవసరమైతే నిరాహార దీక్షకు కూడా వెనుకాడనని ఆయన మాజీ ప్రియురాలు లావణ్య ఆదివారం తెలిపారు. శనివారం లావణ్య స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. తన దగ్గరున్న ఆధారాలను లావణ్య పోలీసులకు అప్పగించింది. దీంతో రాజ్‌తరుణ్‌కు పోలీసులు నోటీసులిచ్చి విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు విచారణను తప్పించుకునేందుకు రాజ్‌తరుణ్‌ హిమాచల్‌ప్రదేశ్‌లోని మాల్వీ మల్హోత్రా సొంతూరైన మండీలో తలదాచుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని తెలిపారు. మరిన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలిపారు.

Updated Date - Jul 15 , 2024 | 10:18 AM