Kooli : రజనీ రాజసం

ABN , Publish Date - Jul 06 , 2024 | 05:23 AM

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కూలీ’. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగుతోంది. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో పాల్గొనేందుకు రజనీకాంత్‌ ఇటీవలే హైదరాబాద్‌ చేరుకున్నారు. శుక్రవారం చిత్రీకరణ మొదలుపెట్టినట్లు నిర్మాణసంస్థ సన్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియా

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కూలీ’. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగుతోంది. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో పాల్గొనేందుకు రజనీకాంత్‌ ఇటీవలే హైదరాబాద్‌ చేరుకున్నారు. శుక్రవారం చిత్రీకరణ మొదలుపెట్టినట్లు నిర్మాణసంస్థ సన్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. దీంతో పాటు రజనీకాంత్‌ స్టైల్‌గా కుర్చీలో కూర్చొని రాజసం ఉట్టిపడే లుక్‌లో ఉన్న పోస్టర్‌ను షేర్‌ చేసింది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

కూలీలో శ్రుతి ఖాయం

‘కూలీ’ చిత్రంలో శ్రుతీహాసన్‌ నటించబోతున్నారనే మాట కొన్నాళ్లుగా మీడియాలో వినిపిస్తోంది. కానీ చిత్రబృందం ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు. శుక్రవారం శ్రుతీహాసన్‌ ఈ సస్పెన్స్‌కు తెరదించారు. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తన ఫొటోను పోస్ట్‌ చేసిన శ్రుతీ ‘కూలీ డే 1 షూటింగ్‌’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ చిత్రంలో ఆమె నటించడం ఖాయమైనట్లే.

Updated Date - Jul 06 , 2024 | 05:23 AM