మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rajinikanth in Hyderabad: హైదరాబాదులో రజనీకాంత్ సందడి, దేనికోసమంటే...

ABN, Publish Date - Mar 11 , 2024 | 10:16 AM

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాదులో తన సినిమా 'వేట్టయాన్' షూటింగ్ నిమిత్తం వచ్చారు. ఇది పోలీసు నేపథ్యంలో వస్తున్నా సినిమా అని ఇందులో రజినీకాంత్ ఒక పోలీసాఫీసరుగా నటిస్తున్నారని వినికిడి

Rajinikanth

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాదులో సందడి చేస్తున్నారు. తన సినిమా 'వేట్టయాన్' షూటింగ్ నిమిత్తం రజినీకాంత్ హైదరాబాదు వచ్చారు. నిన్న అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేశారు, ఈరోజు నాగోల్ రైల్వే స్టేషన్ దగ్గర షూటింగ్ చేయనున్నారని తెలుస్తోంది. (Rajinikanth is in Hyderabad for the shooting of his film Vettaiyan) రజినీకాంత్ 'వేట్టయాన్' సినిమాకి టిజె జ్ఞానవేల్ దర్శకుడు, కాగా లైకా సంస్థపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు ఈ సినిమాని. నిన్న హైదరాబాదు చేరుకున్న రజినీకాంత్ ఇక్కడే షూటింగ్ కొన్ని రోజులు చేస్తారని తెలిసింది.

ఇదే సినిమాలో భారత లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, తెలుగు నటుడు రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నారు. అమితాబ్ ఇంతకుముందే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారని, ఇక్కడ కొన్ని సన్నివేశాల్లో షూటింగ్ కూడా చేశారని, అలాగే రానా దగ్గుబాటి కూడా ఈసారి షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇంతకుముందు అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ పై తిరువనంతపురం లో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. (Rana Daggubati to join Rajinikanth in Hyderabad for the shooting) ఇది అమితాబ్ బచ్చన్ కి మొదటి తమిళ సినిమా. ఈ సినిమాలో మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ తో పాటు మంజు వారియర్, రితిక సింగ్ కూడా నటిస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం ఇదే సినిమా షూటింగ్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఒక పోలీసు నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఇందులో తెలుగు నటుడు రావు రమేష్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని వినికిడి.

Updated Date - Mar 11 , 2024 | 10:16 AM