ఒకే తెరపై రజనీ, సల్మాన్‌

ABN , Publish Date - Jun 25 , 2024 | 01:04 AM

‘రాజారాణి’, ‘తెరి’, ‘మెర్సల్‌’, ‘బిగిల్‌’ చిత్రాలతో సూపర్‌హిట్‌ డైరెక్టర్‌ అనిపించుకున్న అట్లీ కుమార్‌.. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి షారుక్‌ ఖాన్‌ చిత్రం ‘జవాన్‌’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు...

ఒకే తెరపై రజనీ, సల్మాన్‌

‘రాజారాణి’, ‘తెరి’, ‘మెర్సల్‌’, ‘బిగిల్‌’ చిత్రాలతో సూపర్‌హిట్‌ డైరెక్టర్‌ అనిపించుకున్న అట్లీ కుమార్‌.. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి షారుక్‌ ఖాన్‌ చిత్రం ‘జవాన్‌’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు. ఆయన ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం మేరకు ఈ సినిమాలో రజనీకాంత్‌ కూడా నటించనున్నారు. ఇలా ఒకే తెరపై వీరిద్దరూ కనపడితే.. వారి అభిమానుల ఆనందాలకు హద్దులు ఉండకపోవడమే కాకుండా అది బాక్సాఫీ్‌సకు కూడా పండుగ వాతావరణాన్ని తెప్పిస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇందులో రజనీ ఏ పాత్రను పోషిస్తున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.


ఈ చిత్ర నిర్మాత, సన్‌ పిక్చర్స్‌ అధినేత కళానిధి మారన్‌కు సూపర్‌స్టార్‌తో ఉన్న సత్సంబంధాల వల్లే ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు రజనీ పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. ప్రస్తుతం ‘సికిందర్‌’ షూటింగ్‌లో సల్మాన్‌, ‘కూలీ’ చిత్రీకరణలో బిజీగా ఉన్న రజనీ.. ఆ ప్రాజెక్ట్స్‌ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.

Updated Date - Jun 25 , 2024 | 01:04 AM