హంగులతో వస్తున్న రాజావారు

ABN , Publish Date - Jan 17 , 2024 | 06:05 AM

‘గుర్తుందా శీతాకాలం’ చిత్రంతో నిర్మాతగా తనదైన అభిరుచిని చాటుకున్నారు చింతపల్లి రామారావు. ఇప్పుడాయన నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది...

హంగులతో వస్తున్న రాజావారు

‘గుర్తుందా శీతాకాలం’ చిత్రంతో నిర్మాతగా తనదైన అభిరుచిని చాటుకున్నారు చింతపల్లి రామారావు. ఇప్పుడాయన నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌ హీరోగా దర్శకుడు వేగేశ్న సతీష్‌ రూపొందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా నిర్మాత సినిమా విశేషాలను పాత్రికేయులతో పంచుకున్నారు. వాణిజ్య హంగులతో శ్రీశ్రీశీ రాజావారు’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల్లో తొలి కాపీ సిద్ధమవుతుందని తెలిపారు. ఇక నుంచి ఏటా మూడు సినిమాలు నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు, కన్నడ అగ్రహీరోల తో భారీ సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించారు. వాణిజ్యహంగులతో పాటు సమాజానికి మంచి సందేశం ఉండేలా సినిమాలు చేస్తానని ఆయన తెలిపారు.

Updated Date - Jan 17 , 2024 | 06:05 AM