విడుదలకు సిద్ధమైన రాజావారు

ABN , Publish Date - Jun 11 , 2024 | 05:08 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌, సంపద హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో

విడుదలకు సిద్ధమైన రాజావారు

జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌, సంపద హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో చింతపల్లి రామరావు ఈ సినిమాను నిర్మించారు. ఆయన మాట్లాడుతూ ‘అన్ని కమర్షియల్‌ అంశాలు కలిగిన సినిమా ఇది. దర్శకుడు సతీశ్‌ చిత్రాన్ని చక్కగా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్‌ చేసే సినిమా ఇది. ిచిత్రం బాగుందని సెన్సార్‌ సభ్యులు ప్రశంసించారు. త్వరలో విడుదల చేస్తాం’ అని చెప్పారు. రావు రమేశ్‌, నరేశ్‌, రఘు కుంచె, ప్రవీణ్‌, రచ్చ రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: ప్రియమణి, సంగీతం: కైలాష్‌ మీనన్‌, ఫొటోగ్రఫీ: దాము నర్రావుల, సమర్పణ: రంగాపురం రాఘవేంద్ర.

Updated Date - Jun 11 , 2024 | 05:08 AM