Rajamouli: మహేశ్‌తో చేయబోయే సినిమాకు.. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు
ABN , Publish Date - Mar 01 , 2024 | 08:02 PM
దర్శకుడు రాజమౌళి), సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో ఫస్ట్ టైం ఓ చిత్రం త్వరలో పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి తన నెక్ట్స్ సినిమా గురించి తన మిత్రులతో పంచుకున్నారు.

దర్శకుడు రాజమౌళి (SS Rajamouli), సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో ఫస్ట్ టైం ఓ చిత్రం త్వరలో పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. శివరాత్రి తర్వాత అధికారికంగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవనుండగా ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తవగా నటీనటుల ఎంపికలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. కౌబాయ్ తరహా కథాంశంతో ఆఫ్రికా ఆడవుల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా నిమిత్తం మహేశ్‌బాబు ఈమధ్యే జర్మనీ వెళ్లి మరీ అక్కడి జిమ్ ట్రైనర్ల సమక్షంలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోని తన లుక్‌ను సైతం మార్చుకున్నారు. ఇప్పటికే కథానాయిక ఎంపిక జరిగినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.
ఇదిలాఉండగా మూడు రోజుల క్రితం వారాహి చలనచిత్రం బ్యానర్ నిర్మాత సాయి కొర్రపాటి ఇటీవల కర్ణాటక బళ్లారిలో నిర్మించిన అమృతేశ్వర ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి కన్నడ సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు నుంచి కూడా సినిమా స్టార్లు భారీగానే హజరయ్యారు. వీరిలో ముఖ్యంగా రాజమౌళి కుటంబంతో సహా వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఉన్న కర్ణాటకకు చెందిన పలువురు రాజకీయ నాయకులతో మాటామంతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రం గురించి వారితో చెప్పారు.
ఈ సందర్భంగా తన చిత్రం గురించి మట్లాడుకున్నారు. మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నానని, అతి త్వరలో సినిమా ప్రారభం కాబోతున్నదని, ఇంకా ఏ పేరు డిసైడ్ చేయలేదని త్వరలో అధికారికంగా ఓ కార్యక్రమం నిర్వహించి వివరాలు వెళ్లడించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇదిలాఉండగా ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే , కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే మహేశ్‌బాబుకు జోడీగా ఇండోనేషియా స్టార్ చెల్సియా ఇస్లాన్ (Chelsea Islan),మరో ప్రధాన పాత్రకు హీలీవుడ్ ఎక్స్‌ట్రాక్షన్ హీరో క్రిస్ హెమ్స్‌వర్త్ (Chris Hemsworth) సెలక్ట్ అయినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు బాగా హల్చల్ చేస్తుండగా తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో లెజండ్ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ కూడా పాలు పంచుకోనున్నట్లు సమాచారం.