రాజమౌళి, మహేశ్‌ చిత్రం ఎప్పటినుంచి అంటే...!

ABN , Publish Date - Mar 05 , 2024 | 02:37 AM

దర్శక ధీరుడు రాజమౌళితో చేయబోయే యాక్షన్‌ అడ్వంచర్‌ చిత్రం కోసం సన్నద్ధమవుతున్నారు మహేశ్‌ బాబు. ఇందుకోసం తన లుక్‌ను కూడా సరికొత్తగా మార్చుకున్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు...

రాజమౌళి, మహేశ్‌ చిత్రం ఎప్పటినుంచి అంటే...!

దర్శక ధీరుడు రాజమౌళితో చేయబోయే యాక్షన్‌ అడ్వంచర్‌ చిత్రం కోసం సన్నద్ధమవుతున్నారు మహేశ్‌ బాబు. ఇందుకోసం తన లుక్‌ను కూడా సరికొత్తగా మార్చుకున్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్రం గురించి ఆయన అప్‌డేట్‌ ఇచ్చారు. అందరిలానే తానూ రాజమౌళితో చేసే చిత్రం షూటింగ్‌ ప్రారంభం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయని, త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ప్రొఫెషన్‌ను, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవడం కత్తి మీద సాము లాంటిదని మహేశ్‌ అన్నారు. తన రీసెంట్‌ రిలీజ్‌ ‘గుంటూరు కారం’ చిత్రంపై ప్రేక్షకులు చూపిన ఆదరణ ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా తన జీవితాన్ని మార్చేసిన మూడు సినిమాల గురించి మహేశ్‌ ప్రస్తావించారు. ‘మురారి’, ‘పోకిరి’, ‘శ్రీమంతుడు’ చిత్రాలు ప్రేక్షకుల ముందు తనను సరికొత్తగా ఆవిష్కరించాయని తెలిపారు. తాను నటించే చిత్రాలకు అంగీకారం తెలిపేముందు పాత్ర, నైతిక విలువలను దృష్టిలోకి తీసుకుంటానని అన్నారు. ఒకసారి చిత్రానికి సైన్‌ చేశాక దర్శకుడి విజన్‌ ప్రకారమే ముందుకెళ్తానని తెలిపారు.

Updated Date - Mar 05 , 2024 | 02:37 AM