రాజ్‌ తరుణ్‌ కొత్తగా కనిపిస్తారు

ABN , Publish Date - May 17 , 2024 | 02:33 AM

రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘పురుషోత్తముడు’. హాసినీ సుధీర్‌ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రామ్‌ భీమన దర్శకుడు. డాక్టర్‌ రమేశ్‌ తేజావత్‌, ప్రకాశ్‌ తేజావత్‌ నిర్మాతలు...

రాజ్‌ తరుణ్‌ కొత్తగా కనిపిస్తారు

రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘పురుషోత్తముడు’. హాసినీ సుధీర్‌ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రామ్‌ భీమన దర్శకుడు. డాక్టర్‌ రమేశ్‌ తేజావత్‌, ప్రకాశ్‌ తేజావత్‌ నిర్మాతలు. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టా, సినిమా బాగా వచ్చేలా చూశారు నిర్మాత రమేశ్‌. అలాగే దర్శకుడు రామ్‌, నేను ఒక అండర్‌స్టాండింగ్‌తో వర్క్‌ చేశాం. జూన్‌ 6న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. సెన్సార్‌ పూర్తయ్యాక విడుదల తేదీ ప్రకటిస్తాం’ అని చెప్పారు. ‘సినిమా తీయాలన్నది నా 30 ఏళ్ల కల. దర్శకుడు రామ్‌ చెప్పిన కథ నచ్చి వెంటనే ప్రారంభించాం. నా సోదరుడు ప్రకాశ్‌, నా సతీమణి, పిల్లలు ప్రొడక్షన్‌ వ్యవహారాలు చూసుకున్నారు. ఓ మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తున్నాం’ అన్నారు నిర్మాత రమేశ్‌. దర్శకుడు రామ్‌ భీమన మాట్లాడుతూ ‘రాజ్‌ తరుణ్‌ని తెరపై కొత్తగా ప్రజెంట్‌ చేసే సినిమా ఇది. ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌లా ఉంటుంది. బడ్జెట్‌ గురించి ఆలోచించకుండా పెద్ద ఆర్టిస్టులను ఇచ్చి సహకరించిన నిర్మాతలకు నా కృతజ్ఞతలు’ అని చెప్పారు.

Updated Date - May 17 , 2024 | 02:33 AM