రాఘవ లారెన్స్ 25వ సినిమా
ABN , Publish Date - Sep 15 , 2024 | 02:49 AM
‘రాక్షసుడు’, ‘ఖిలాడీ’ చిత్రాల తర్వాత నిర్మాత కోనేరు సత్యనారాయణ మరో భారీ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. యాక్షన్, అడ్వంచర్ అంశాలతో రూపుదిద్దుకొనే ఈ చిత్రంలో...
‘రాక్షసుడు’, ‘ఖిలాడీ’ చిత్రాల తర్వాత నిర్మాత కోనేరు సత్యనారాయణ మరో భారీ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. యాక్షన్, అడ్వంచర్ అంశాలతో రూపుదిద్దుకొనే ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ హీరోగా నటించనున్నారు. ఇది ఆయనకు 25వ సినిమా కావడం గమనార్హం. ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెర కెక్కనున్న ఈ సినిమాకు రమేశ్ వర్మ దర్శకుడు. ఆయనతో కోనేరు సత్యనారాయణ తీస్తున్న మూడో చిత్రం ఇది. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.