Radha Madhavam: ‘రాధా మాధవం’ సినిమా.. ఓ పండుగలా ఉంటుంది

ABN , Publish Date - Feb 29 , 2024 | 09:24 PM

అందమైన గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా ‘రాధా మాధవం’ రాబోతోంది. ఈ చిత్రంలో వినాయక్ దేశాయ్ , అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో వినాయక్ దేశాయ్ మీడియాతో ముచ్చటించారు.

Radha Madhavam: ‘రాధా మాధవం’ సినిమా.. ఓ పండుగలా ఉంటుంది
RADHA MADHAVAM

అందమైన గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా ‘రాధా మాధవం’ (Radha Madhavam) రాబోతోంది. ఈ చిత్రంలో వినాయక్ దేశాయ్ (Vinayak Desai), అపర్ణా దేవీ (Aparna Devi) హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని గోనాల్ వెంకటేష్ నిర్మించగా.. దాసరి ఇస్సాకు (ESHAKU DASARI) దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో వినాయక్ దేశాయ్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..

WhatsApp Image 2024-02-29 at 8.27.14 PM.jpeg

మాతృభాష కన్నడ అయినా.. పెరిగింది ముంబైలోనే. అక్కడే సినిమా ప్రయత్నాలు చేశాను. కన్నడలో చిన్న చిన్న పాత్రల్లో నటించాను. బాహుబలి సినిమా చూసి తెలుగు చిత్ర సీమకు రావాలని నిశ్చయించుకున్నాను. చేస్తున్న బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలి హైద్రాబాద్‌కు వచ్చి సినిమా ప్రయత్నాలు చేశాను. అలా 2019 నుంచి ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. కరోనా టైంలో ఆన్ లైన్ డ్యాన్స్ క్లాసులు కూడా చెప్పేవాడిని. ‘శ్రీరంగపురం’ అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాను. ‘లవర్స్ లవ్ స్టోరీ’ అనే మూవీ చేయగా.. అది ఓటీటీలోకి వచ్చింది. నా మూడో చిత్రమే రాధా మాధవం.


రాధా మాధవం (Radha Madhavam) దర్శకుడు ఇస్సాకు నాకు మంచి ఫ్రెండ్. హైద్రాబాద్ వచ్చిన కొత్తలో పరిచయం అయ్యాడు. అతను చాలా టాలెంటెడ్ పర్సన్. తనకు దర్శకుడిగా అవకాశం వస్తే.. నాకు ఈ సినిమాను ఇచ్చారు. దర్శక నిర్మాతలు నాకు ముందు నుంచీ పరిచయం ఉండటంతో ఈ మూవీ ఆఫర్ వచ్చింది. అపర్ణా దేవి గారు క్లాసికల్ డ్యాన్సర్. ఆమె ఎంతో సహజంగా నటించేవారు. ఆమెకు భాష రాకపోతే మేం అంతా తెలుగులో ట్రైనింగ్ ఇచ్చాం. చాలా అద్భుతంగా నటించారు. సెట్స్‌కి సమయానికి వచ్చేవారు. సినిమా టీంకు ఎంతో సహకరించారు. నిర్మాత గోనాల్ వెంకటేష్ గారు కొత్త వారిని ఎంకరేజ్ చేస్తుంటారు. మేం అంతా కొత్త వాళ్లమే అయినా మా మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రాధా మాధవం సినిమాను నిర్మించారు.

RADHA MADAVAM.jpeg

చైతన్య కొల్లి ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ సినిమాకు ప్లస్‌గా నిలుస్తాయి. థాజ్ విజువల్స్ ఎంతో సహజంగా ఉంటాయి. సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్‌తో చాలా మంచి అవుట్ పుట్ తీసుకొచ్చాం. మా చిత్రం అందరికీ ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. అందమైన గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా రాధా మాధవం రాబోతోంది. గ్రామీణ ప్రేక్షకులకు ఈ చిత్రం ఓ పండుగలా ఉంటుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. మా లాంటి కొత్త వాళ్లని, కొత్త టీం చేసిన ప్రయత్నాన్ని ఆడియెన్స్ ఆదరిస్తే.. మున్ముందు మరిన్ని ప్రయోగాలు చేస్తాం. మార్చి 1న రాబోతోన్న ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

Updated Date - Feb 29 , 2024 | 09:24 PM