ఆరోగ్యంగానే ఉన్నా ఆర్‌.నారాయణమూర్తి

ABN, Publish Date - Jul 18 , 2024 | 12:51 AM

ప్రజానటుడు ఆర్‌.నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతతో బుధవారం నిమ్స్‌ అసుపత్రిలో చేరారు. ఆయనను ప్రత్యేక విభాగంలో ఉంచి నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప ఆధ్వర్యంలో వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు...

ప్రజానటుడు ఆర్‌.నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతతో బుధవారం నిమ్స్‌ అసుపత్రిలో చేరారు. ఆయనను ప్రత్యేక విభాగంలో ఉంచి నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప ఆధ్వర్యంలో వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలో ఆయనకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరిగి ఉండటంతో హృద్రోగ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ పరీక్షలను వైద్యలు చేసి, ప్రమాదం ఏమీ లేదని నిర్ధారించారు. గ్యాస్ట్రిక్‌ సమస్య అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నారాయణమూర్తికి ఏమైందంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుండడంతో ‘ నేను ఆరోగ్యంగా ఉన్నా.. అభిమానులూ ఆందోళన చెందకండి. దేవుడి దయ వల్ల బాగానే ఉన్నా. పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని వివరాలూ వెల్లడిస్తా’ అని ఓ ప్రకటనలో తెలిపారు నారాయణమూర్తి.

Updated Date - Jul 18 , 2024 | 12:51 AM