ఖురేషి అబ్రమ్‌.. అదిరే లుక్‌!

ABN , Publish Date - May 22 , 2024 | 12:52 AM

మలయాళ అగ్రనటుడు మోహన్‌లాల్‌ నటించిన సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘లూసిఫర్‌’కు సీక్వెల్‌ వస్తోంది. ‘ఎల్‌ 2 ఎంపురాన్‌’ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ ఖురేషి అబ్రమ్‌ పాత్రను పోషిస్తున్నారు...

ఖురేషి అబ్రమ్‌.. అదిరే లుక్‌!

మలయాళ అగ్రనటుడు మోహన్‌లాల్‌ నటించిన సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘లూసిఫర్‌’కు సీక్వెల్‌ వస్తోంది. ‘ఎల్‌ 2 ఎంపురాన్‌’ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ ఖురేషి అబ్రమ్‌ పాత్రను పోషిస్తున్నారు. స్టీఫెన్‌ నడుంపల్లి ఖురేషి అబ్రమ్‌గా ఎలా మారాడనే విషయాన్ని సీక్వెల్‌లో చూపించబోతున్నారు. మోహన్‌లాల్‌ పుట్టినరోజు సందర్భంగా ఆ పాత్ర లుక్‌ విడుదల చేశారు. స్టయిలిష్‌గా నడుచుకుంటూ వస్తున్న మోహన్‌లాల్‌ లుక్‌ అదిరిపోయిందని అంటున్నారు. నటుడు, ఈ చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమార్‌ ‘హ్యాపీ బర్త్‌ డే లాలెట్టా’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా మోహన్‌లాల్‌కు అభినందనలు తెలిపారు. మరో విషయం ఏమిటంటే లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ‘ఎల్‌ 2 ఎంపురాన్‌’ చిత్రంతో మలయాళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతోంది. లడఖ్‌, చెన్నై, కొట్టాయం, అమెరికా, లండన్‌ ప్రాంతాల్లో ‘ఎల్‌ 2 ఎంపురాన్‌’ చిత్రం షూటింగ్‌ జరిగింది.


ప్రస్తుతం తిరువనంతపురంలో చిత్రీకరణ జరుగుతోంది. ఆ తర్వాత గుజరాత్‌, దుబాయ్‌లో కూడా షూటింగ్‌ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది భారీ లెవల్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు సుభాస్కరన్‌, ఆంటోనీ పెరుంబపూర్‌ చెప్పారు.

Updated Date - May 22 , 2024 | 12:52 AM