ఐదు భాషల్లో కొటేషన్ గ్యాంగ్
ABN , Publish Date - Aug 28 , 2024 | 02:28 AM
జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీ లియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రలు పోషించిన ‘క్యూజీ’ చిత్రం ఈ నెల 30న ఐదు భాషల్లో విడుదల కానుంది....
జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీ లియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రలు పోషించిన ‘క్యూజీ’ చిత్రం ఈ నెల 30న ఐదు భాషల్లో విడుదల కానుంది. తెలుగు వరల్డ్ వైడ్ హక్కుల్ని వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ప్రసన్నకుమార్, దామోదర ప్రసాద్ హజరయ్యారు. ఇది మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని వేణుగోపాల్ చెప్పారు. అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని చిత్ర సమర్పకుడు ఎన్టీఆర్ శ్రీను చెప్పారు.