టైటిల్‌ సాంగ్‌తో పుష్పరాజ్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:55 AM

‘పుష్ప’ చిత్రంతో జాతీయ ఉత్తమనటుడి పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు అల్లు అర్జున్‌. ఇప్పుడు సుకుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప 2:ది రూల్‌’ తెరకెక్కుతోన్న...

టైటిల్‌ సాంగ్‌తో పుష్పరాజ్‌

‘పుష్ప’ చిత్రంతో జాతీయ ఉత్తమనటుడి పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు అల్లు అర్జున్‌. ఇప్పుడు సుకుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప 2:ది రూల్‌’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి అప్డేట్‌ వచ్చింది. తొలి పాటను మే 1న విడుదల చేయబోతున్నట్లు బుధవారం చిత్రబృందం తెలిపింది. దీనికి సంబంధించిన 20 సెకన్ల ప్రోమోను విడుదల చేశారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీత సారథ్యంలో ‘పుష్ప పుష్ప పుష్పరాజ్‌’ అంటూ సాగే ఈ టైటిల్‌ సాంగ్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మాతలు. సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్‌.

Updated Date - Apr 25 , 2024 | 05:55 AM