ఇంకో 75 రోజుల్లో పుష్ప రూల్
ABN , Publish Date - Sep 24 , 2024 | 02:52 AM
‘పుష్ప ద రూల్’.. భారతీయ సినీపరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. అల్లు అర్జున్ నటిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం మరో 75 రోజుల్లో అంటే డిసెంబర్ 6న విడుదల కానుంది....
‘పుష్ప ద రూల్’.. భారతీయ సినీపరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. అల్లు అర్జున్ నటిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం మరో 75 రోజుల్లో అంటే డిసెంబర్ 6న విడుదల కానుంది. అంటే పుష్ఫ రూల్‌కు కౌంట్ డౌన్ మొదలైందన్నమాట. అల్లు అర్జున్ నటన కోసం, దర్శకుడు సుకుమార్ టేకింగ్, మేకింగ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కంటెంట్ పరంగానే కాకుండా సాంకేతికంగా కూడా ఈ సినిమా అత్యున్నత స్థాయిలో ఉంటుందని నిర్మాతలు నవీన్ యర్నేని, రవిశంకర్ చెప్పారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందనీ, ఇక వచ్చే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోయే రీతిలో ఉంటుందని వారు తెలిపారు. రశ్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.