పుష్ప రాజే నా రోల్‌ మోడల్‌

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:06 AM

గ్లామర్‌ రోల్స్‌లో మెప్పిస్తూనే మరోవైపు నటనకు ఆస్కారమున్న పాత్రలనూ ఎంచుకుంటుంటారు అగ్ర కథానాయిక సమంత. ఇటీవలే మయోసైటిస్‌ అనే వ్యాధి నుంచి కోలుకుని సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిందీ భామ...

పుష్ప రాజే నా రోల్‌ మోడల్‌

గ్లామర్‌ రోల్స్‌లో మెప్పిస్తూనే మరోవైపు నటనకు ఆస్కారమున్న పాత్రలనూ ఎంచుకుంటుంటారు అగ్ర కథానాయిక సమంత. ఇటీవలే మయోసైటిస్‌ అనే వ్యాధి నుంచి కోలుకుని సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిందీ భామ. తాజాగా, ఓ కాలేజి ఫంక్షన్‌లో పాల్గొన్న సమంత అక్కడి విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అందులో ఒక విద్యార్థి ‘నటనలో మీకు రోల్‌ మోడల్‌ ఎవరు’ అని ప్రశ్నిస్తే, ఆమె తడుముకోకుండా అల్లు అర్జున్‌ అని తెలిపింది. ఒక సినిమా నుంచి మరో సినిమాకు అల్లు అర్జున్‌ ఎంతో పరిణితి చెందుతూ యాక్టింగ్‌ బీస్ట్‌గా మారారని ప్రశంసించింది. ఆయనతో కలసి తెరను పంచుకోవడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయమని, అందుకోసమే మళ్లీ తనతో నటించే చాన్సు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానంది. ఈ మాటలు విన్న స్టైలిష్ట్‌ స్టార్‌ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. వీళ్లిద్దరూ కలసి ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ చిత్రంలోని ఓ ఐటెమ్‌ సాంగ్‌లో మెరిసిందీ బ్యూటీ. ప్రస్తుతం సిటాడెల్‌, చెన్నై స్టోరీస్‌తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది సమంత.

Updated Date - Mar 06 , 2024 | 09:37 AM