ఆ కోరికను పుష్ప 2 తీర్చింది
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:15 AM
‘పుష్ప చిత్రం అంతర్జాతీయ స్థాయిలో నాకు నటుడిగా గుర్తింపును ఇచ్చింది. డిసెంబర్ 5న వస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంతో దేశవ్యాప్తంగా వైల్డ్ ఫైర్ రాబోతోంది. మూడేళ్లు నా జీవితాన్ని ఈ సినిమాకు అంకితం చేశాను....
‘పుష్ప చిత్రం అంతర్జాతీయ స్థాయిలో నాకు నటుడిగా గుర్తింపును ఇచ్చింది. డిసెంబర్ 5న వస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంతో దేశవ్యాప్తంగా వైల్డ్ ఫైర్ రాబోతోంది. మూడేళ్లు నా జీవితాన్ని ఈ సినిమాకు అంకితం చేశాను. హీరో అయినప్పటి నుంచి చెన్నైలో నా సినిమా కార ్యక్రమం ఒక్కటైనా చేయాలనుకుంటున్నాను. ఆ కోరికను ‘పుష్ప 2’ తీర్చింది’ అని అల్లు అర్జున్ అన్నారు. ఆయన హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. ఆదివారం చెన్నైలో ‘వైల్డ్ ఫైర్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో అల్లు అర్జున్, శ్రీలీల నర్తించిన ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ ‘రష్మిక తక్కువ సమయంలోనే నా మనసుకు దగ్గరయ్యారు.
తను నన్ను చాలా బాగా ప్రోత్సహించారు. అల్లు అర్జున్ పాట కావడంతో బాగా కష్టపడ్డాను’ అని చెప్పారు. రష్మిక మందన్న మాట్లాడుతూ ‘పుష్ప’ కు ముందు తర్వాత అనేలా నా కెరీర్ మారింది. నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా ఈ చిత్రం మిగిలిపోతుంది’ అన్నారు.