‘పుష్ప 2’ డేట్‌ మారింది!

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:46 AM

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప 2’ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ వై ఇంతకుముందు ప్రకటించారు. అయితే షూటింగ్‌ పార్ట్‌తో పాటు...

‘పుష్ప 2’  డేట్‌ మారింది!

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప 2’ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ వై ఇంతకుముందు ప్రకటించారు. అయితే షూటింగ్‌ పార్ట్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడం, క్వాలీటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా, టెక్నికల్‌గా మరింత అత్యున్నత విలువలతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో విడుదల తేదీని మార్చామనీ, డిసెంబర్‌ 6న సినిమా రిలీజ్‌ అవుతుందని నిర్మాతలు తాజాగా వెల్లడించారు. రశ్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇంతవరకూ విడుదలైన ‘పుష్పరాజ్‌’ టైటిల్‌ సాంగ్‌, ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అనే కపుల్‌ సాంగ్‌ సంచలనం సృష్టించాయి. ఈ రెండు పాటల తర్వాత సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ‘పుష్ఫ 2’ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే దర్శకుడు సుకుమార్‌ విడుదల విషయంలో తొందర పడకుండా మేకింగ్‌ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.

Updated Date - Jun 18 , 2024 | 03:46 AM