Pushpa 2 : వైజాగ్‌లో పుష్ప రూల్‌

ABN , Publish Date - Mar 12 , 2024 | 05:24 AM

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్‌’ చిత్రం షూటింగ్‌ ఏకధాటిగా కొనసాగుతోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ విశాఖపట్నంలో ప్రారంభమైంది...

Pushpa 2 : వైజాగ్‌లో పుష్ప రూల్‌

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్‌’ చిత్రం షూటింగ్‌ ఏకధాటిగా కొనసాగుతోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ విశాఖపట్నంలో ప్రారంభమైంది. షూటింగ్‌లో పాల్గొనేందుకు అల్లు అర్జున్‌ విశాఖపట్నం వెళ్లారు. వారం రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ప్రతినాయక పాత్ర పోషిస్తున్న ఫహాద్‌ ఫాజిల్‌ కూడా పాల్గొంటున్నారు. ఆగస్టు 15న ‘పుష్ప 2’ ప్రేక్షకులు ముందుకు రానుంది. సుకుమార్‌ దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక.

=

Updated Date - Mar 12 , 2024 | 05:24 AM