స్వచ్చమైన తెలుగింటి టైటిల్‌

ABN , Publish Date - Apr 12 , 2024 | 05:35 AM

రామ్‌కిరణ్‌, మేఘా ఆకాశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్‌, రాజశ్రీ నాయర్‌, రచ్చ రవి, గిరిధర్‌, తాగుబోతు రమేష్‌, బద్రం...

స్వచ్చమైన తెలుగింటి టైటిల్‌

రామ్‌కిరణ్‌, మేఘా ఆకాశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్‌, రాజశ్రీ నాయర్‌, రచ్చ రవి, గిరిధర్‌, తాగుబోతు రమేష్‌, బద్రం కీలక పాత్రలు పోషిస్తున్నారు. హెచ్‌ మహదేవ గౌడ్‌ నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మహాదేవ గౌడ్‌ మాట్లాడుతూ ‘‘అచ్చమైన తెలుగింటి టైటిల్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నందుకు చాలా మంది మెచ్చుకున్నారు. ఈ సినిమా మంచి కుటుంబ చిత్రంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది’’ అని అన్నారు. డైరెక్టర్‌ ఉదయ్‌ శర్మ మాట్లాడుతూ ‘‘రేషన్‌ కార్డులాగా ఉన్న ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్‌ చాలా పెద్ద అసెట్‌. సినిమాలో చాలా మంచి కంటెంట్‌ ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: శశాంక్‌ మలి, డిఓపీ: మధు దాసరి, సంగీతం: మణి శర్మ.

Updated Date - Apr 12 , 2024 | 05:35 AM