ప్రముఖ రచయిత పురాణపండ స్విచ్ ఆన్, ‘బేబీ’ ఫేమ్ విరాజ్ అశ్విన్ క్లాప్‌తో నూతన చిత్రం ప్రారంభం

ABN , Publish Date - Apr 29 , 2024 | 09:21 PM

రవితేజ మహాదాస్యం క‌థానాయ‌కుడిగా నూతన నిర్మాణ సంస్థ ఆర్ట్ మేకర్స్ సమర్పణలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం సోమవారం ఉదయం హైదరాబాద్ మణికొండ శివాలయంలో ప్రారంభమైంది.

ప్రముఖ రచయిత పురాణపండ స్విచ్ ఆన్, ‘బేబీ’ ఫేమ్ విరాజ్ అశ్విన్  క్లాప్‌తో నూతన చిత్రం ప్రారంభం
viraj

రవితేజ మహాదాస్యం క‌థానాయ‌కుడిగా నూతన నిర్మాణ సంస్థ ఆర్ట్ మేకర్స్ (ART MAKERS) సమర్పణలో ఓ చిత్రం రూపొందుతోంది. నూతన దర్శకుడు మద్దుల మదన్ కుమార్ (MADAN KUMAR MADDULA) దర్శకత్వంలో కుమారి సౌజన్య కావూరి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చలన చిత్రం సోమవారం ఉదయం హైదరాబాద్ మణికొండ శివాలయంలో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు నూతన కథానాయకుడు రవితేజ మహాదాస్యం పై ‘బేబీ’ సినిమా ఫేమ్ విరాజ్ అశ్విన్ (VIRAJ ASWIN ) క్లాప్ కొట్టగా, ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

WhatsApp Image 2024-04-29 at 8.50.06 PM (1).jpeg

ఈ సంద‌ర్భంగా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ (PURANAPANDA SRINIVAS) మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం వస్తున్న కొత్త తరం మేధస్సు, ఉత్సాహం, ప్రతిభ, సామర్ధ్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. సినీ రంగంలోకి వస్తున్న ఈ తరాన్ని కొందరు ఆక్షేపించి చులకనగా చూస్తున్నారు, తరువాత వీరి సృజనాత్మక సామర్ధ్యాన్ని చూసి ఈ వెటకారపు రాయుళ్లు ముక్కున వ్రేళ్లేసుకుంటున్నారు. ఇది జరిగిన చరిత్ర. జరుగుతున్న చరిత్ర. జీవితంలో ఎవ్వరినీ తక్కువ అంచనా వేయొద్దని, ఎవ్వరినీ అవమానించొద్దన్నారు.


WhatsApp Image 2024-04-29 at 8.50.06 PM.jpeg

ఈ చిత్రానికి డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ నితిన్ రెడ్డి చిమ్ముల, ఎడిటింగ్: అఖిల్ దేశ్ పాండే, సంభాషణలు మరియు పాటలు జక్కా రాజశేఖర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ మక్కెన విజయ్, తేజస్విని డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సహా నిర్మాతలు: దియా, సంజీవ్ కోనేరు, వెంకట్ రమణారెడ్డి.

Updated Date - Apr 30 , 2024 | 02:49 PM