హీరోగా... విలన్‌గా

ABN , Publish Date - May 25 , 2024 | 06:15 AM

నితిన్‌ హీరోగా నటించిన ‘దిల్‌’ చిత్రానికి లోగో తయారు చేయడం ద్వారా 25 నితిన్‌ హీరోగా నటించిన ‘దిల్‌’ చిత్రానికి లోగో తయారు చేయడం ద్వారా 25 ఏళ్ల క్రితం పబ్లిసిటీ ఆర్టి్‌స్టగా కెరీర్‌ ప్రారంభించిన వరంగల్‌ కుర్రాడు విష్ణువర్థన్‌ రెడ్డి ఇప్పటివరకూ ఏళ్ల క్రితం పబ్లిసిటీ ఆర్టి్‌స్టగా కెరీర్‌ ప్రారంభించిన వరంగల్‌ కుర్రాడు విష్ణువర్థన్‌ రెడ్డి ఇప్పటివరకూ

హీరోగా... విలన్‌గా

నితిన్‌ హీరోగా నటించిన ‘దిల్‌’ చిత్రానికి లోగో తయారు చేయడం ద్వారా 25 ఏళ్ల క్రితం పబ్లిసిటీ ఆర్టి్‌స్టగా కెరీర్‌ ప్రారంభించిన వరంగల్‌ కుర్రాడు విష్ణువర్థన్‌ రెడ్డి ఇప్పటివరకూ 500లకు పైగా చిత్రాలకు లోగోలు, వందకు పైగా సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు. ‘పబ్లిసిటీ ఆర్టిస్ట్‌ వివరెడ్డి’గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణువర్థన్‌ రెడ్డి ఇప్పుడు నటుడిగా తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఇంతవరకూ 25 చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం ‘ఓ తండ్రి తీర్పు’ చిత్రంలో హీరోగా నటిస్తుండడం విశేషం. అలాగే ‘ద స్కూల్‌’ ‘జయతు జయతు’ , ‘లగ్గం’, ‘నంద’ చిత్రాల్లో విలన్‌గానూ నటిస్తున్నారు. ‘పబ్లిసిటీ ఆర్టిస్టుగా పని చేస్తూనే మంచి పాత్రలు వస్తే నటించాలన్నది నా ఆశయం’ అని చెప్పారు విష్ణువర్థన్‌ రెడ్డి.

Updated Date - May 25 , 2024 | 06:15 AM