సైకో థ్రిల్లర్స్‌లో ట్రెండ్‌ సెట్‌ చేస్తుంది

ABN , Publish Date - May 16 , 2024 | 05:26 AM

‘మంత్ర, మంగళ’ లాంటి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో దర్శకుడిగా మంచి విజయాలను అందుకున్నారు ఓషో తులసిరామ్‌. ఈసారి ఆయన సైకో థ్రిల్లర్‌ చిత్రం ‘దక్షిణ’తో ప్రేక్షకులను...

సైకో థ్రిల్లర్స్‌లో ట్రెండ్‌ సెట్‌ చేస్తుంది

‘మంత్ర, మంగళ’ లాంటి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో దర్శకుడిగా మంచి విజయాలను అందుకున్నారు ఓషో తులసిరామ్‌. ఈసారి ఆయన సైకో థ్రిల్లర్‌ చిత్రం ‘దక్షిణ’తో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కల్ట్‌ కాన్సెప్ట్స్‌ మూవీ బేనర్‌పై అశోక్‌ షిండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కబాలి’ ఫేమ్‌ సాయిధన్సిక ఇందులో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా చేతుల మీదుగా యూనిట్‌ బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ మధ్య కాలంలో నన్ను భయపెట్టిన ట్రైలర్‌ ఇదే. ‘దక్షిణ’ చిత్రంతో తులసిరామ్‌ గారు టాలీవుడ్‌కి మరో ట్రెండ్‌ సెట్టర్‌ సైకో థ్రిల్లర్‌ను ఇవ్వబోతున్నారు’ అని ప్రశంసించారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘దక్షిణ’ సినిమా ప్రేక్షకులకు సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్‌ను ఇస్తుంది. తర్వాతేం జరుగుతుందో అనే ఉత్కంఠను ప్రేక్షకులు అనుభవిస్తారు, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చెప్పారు.

Updated Date - May 16 , 2024 | 05:26 AM