నిర్మాతల టాక్

ABN , Publish Date - Jul 31 , 2024 | 01:29 AM

ప్రతి శుక్రవారం కొన్ని సినిమాలను విడుదల చేయడం తెలుగు చిత్రపరిశ్రమలో ఒక ఆనవాయితీ. ఆ ఒక్క రోజుతోనే చాలా మంది సినిమావాళ్ల జాతకాలు మారిపోతుంటాయి. అందుకే...

ప్రతి శుక్రవారం కొన్ని సినిమాలను విడుదల చేయడం తెలుగు చిత్రపరిశ్రమలో ఒక ఆనవాయితీ. ఆ ఒక్క రోజుతోనే చాలా మంది సినిమావాళ్ల జాతకాలు మారిపోతుంటాయి. అందుకే శుక్రవారం కోసం చిత్ర ప్రముఖులతో పాటు ప్రేక్షకులూ ఆశగా ఎదురుచూస్తుంటారు. ఈ శుక్రవారం కూడా అశ్విన్‌బాబు హీరోగా నటించిన ‘శివం భజే’ చిత్రం గురువారం, రాజ్‌ తరుణ్‌ హీరో పాత్ర పోషించిన ‘తిరగబడరా సామీ’ సినిమా శుక్రవారం విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాల నిర్మాతలు మల్కాపురం శివకుమార్‌, మహేశ్వరరెడ్డి మూలి మీడియాతో ముచ్చటించారు.


‘తిరగబడరా సామీ’లో కంటెంట్‌ బాగుంటుంది

భార్యాభర్తలు మూడు ముళ్ల బంధానికి ఎలా కట్టుబడి ఉండాలో సినిమాలో చూపించామనీ, కంటెంట్‌ బాగుంటుందనీ నిర్మాత మల్కాపురం శివకుమార్‌ చెప్పారు.

  • సైలెంట్‌గా ఉన్న వ్యక్తిని వైలెంట్‌గా మార్చేవి పరిస్థితులే. ఈ కథలో అలాంటి పరిస్థితులే ఉంటాయి. ఒక సాధారణ యువకుడు పరిస్థితుల ప్రాబల్యంతో ఎలా మారాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. రాజ్‌ తరుణ్‌ అద్భుతంగా నటించాడు.

  • ప్రతి సినిమాతో కొత్త వారిని పరిచయం చేయాలన్నది నా ఉద్దేశం. గత సినిమాల్లో లాగానే ఈ చిత్రంతో మాల్వీ మల్హోత్రా హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

  • మన్నారా చోప్రా ఇందులో నెగెటివ్‌ ఫీమేల్‌ లీడ్‌ చేసింది. ఆ పాత్రకు ఆమె యాప్ట్‌. సినిమా అంతా ఉంటుంది.

  • ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా జహీరాబాద్‌లో చేశాం. అది మా నేటివ్‌ ప్లేస్‌. చాలా సరదాగా వర్క్‌ జరిగింది.

  • దర్శకుడు రవికుమార్‌ చౌదరి చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. చెప్పినదానికంటే అద్భుతంగా తీశారు. వెరీగుడ్‌ డైరెక్టర్‌.

  • జీడీ చక్రవర్తి, నరేశ్‌ అగస్త్య , సీరత్‌కపూర్‌తో ఓ సినిమా జరుగుతోంది. శ్రవణ్‌ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నా. అలాగే రాహు కేతు అనే వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తున్నాం.

సినిమా అంటే ప్రేమతో చిత్రపరిశ్రమలోకి వచ్చాను. కానీ ఇక్కడ సంపాదించింది ఏమీ లేదు. కాకపోతే మనం బతుకుతూ పదిమందిని బతికించే ఏకైక పరిశ్రమ ఇది. సినిమా సక్సెస్‌ అయితే దాని మీద ఆధారపడిన ఎన్నో జీవితాలు బాగుంటాయి.


ట్రైలర్‌ చూసి వెంకటేశ్‌ మెచ్చుకున్నారు

హీరో అశ్విన్‌బాబు, తన పుట్టినరోజు ఆగస్టు ఒకటిన కావడం వల్ల అదే రోజు సినిమా విడుదల చేయడం లేదనీ, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడం వల్ల ఆ రోజు విడుదల చేస్తున్నామనీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఆయన చెప్పిన వివరాలు ఇవి.

  • మున్ముందు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. అందుకే ఈ వారం విడుదల చేయడమే కరెక్ట్‌ అని నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను.

  • విక్టరీ వెంకటేశ్‌ మా ట్రైలర్‌ చూసి మెచ్చుకున్నారు. ఆయనకి, అశ్విన్‌కు క్రికెట్‌ పరంగా మంచి రిలేషన్‌ ఉంది. ట్రైలర్‌ చూసి బాగుందని ఆయన మెచ్చుకున్నారు.

  • ఈ సినిమాకు సంగీత దర్శకుడు వికాసే హీరో. ‘హిడింబ’ చిత్రం చూసి ఆయన్ని తీసుకున్నాం. మంచి పాటలు, అద్భుతమైన ఆర్‌ఆర్‌ ఇచ్చారు.

  • ‘శివం భజే’ హిట్‌ అయితే తమిళంలో రీమేక్‌ చేస్తాం. ఐఐటీ కృష్ణమూర్తి టీమ్‌తో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నా. కార్తికేయతో కూడా చిత్రం చేయాలనుకుంటున్నాం.

కథలో చాలా లేయర్స్‌ ఉన్నాయి. ఐదారు జానర్లు కలిపినట్టు ఉంటుంది. అందరినీ ఆకట్టుకొనే అంశాలు చాలా ఉన్నాయి. క్వాలిటీ, కంటెంట్‌ కోసం అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టాను.

Updated Date - Jul 31 , 2024 | 01:29 AM