నిర్మాత బూరుగుపల్లి మరోసారి అరెస్టు
ABN, Publish Date - Oct 25 , 2024 | 02:28 AM
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని సర్వే నంబర్ 46లో 83 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసిన కేసులో ఈ నెల 17న అరెస్టు అయ్యి అనారోగ్య కారణాలతో విడుదలయిన నిర్మాత...
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని సర్వే నంబర్ 46లో 83 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసిన కేసులో ఈ నెల 17న అరెస్టు అయ్యి అనారోగ్య కారణాలతో విడుదలయిన నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను గురువారం ఓయూ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. వివరాలలోకి వెళితే తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్ ఆండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 83 ఎకరాల భూమిని శివరామకృష్ణ కబ్జా చేశారని ఇన్‌స్టిట్యూట్ డైర్టెకర్ జరీనా పర్వీన్ ఈ ఏడాది ఆగస్టులో సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు భూ కబ్జా కేసు కావడంతో దానిని ఓయూ పీఎస్‌కు బదిలీ చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు శివరామకృష్ణను దోషిగా తేల్చడంతో ఈ నెల 17న ఓయూ పోలీసులు ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అయితే అనారోగ్య కారణాలతో శివరామకృష్ణకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. కాగా పోలీసులు మరోసారి ప్రభుత్వం తరుఫున న్యాయస్థానంలో వాదనలు వినిపించి శివరామకృష్ణ మంజూరయిన బెయిల్‌ను కొట్టివేయించారు. ఓయూ పోలీసులు గురువారం అయనను మరోసారి అరెస్టు చేశారు.