ప్రియమైన మామయ్యకు...

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:45 AM

ఆంధ్రపదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగు దేశం పార్టీలోని పలువురు నేతలకు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభినందనలు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ అధినేత...

ప్రియమైన మామయ్యకు...

చంద్రబాబు, బాలకృష్ణకు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభినందనలు

ఆంధ్రపదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగు దేశం పార్టీలోని పలువురు నేతలకు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభినందనలు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని మామయ్య, బాలకృష్ణను బాబాయ్‌, పురందేశ్వరిని అత్త అని సంభోదిస్తూ ఈ ట్వీట్‌ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ‘‘ఆంధ్రపదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన ప్రియమైన మామయ్య నారా చంద్రబాబు నాయుడుకు నా హృదయపూర్వక అభినందనలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. మంగళగిరిలో అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్‌కి, మూడోసారి హిందూపూర్‌లో జయభేరి మోగించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన భరత్‌, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన పవన్‌కల్యాణ్‌కు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 03:45 AM