వేడుకగా దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుల ప్రదానం

ABN , Publish Date - Feb 22 , 2024 | 05:40 AM

భారతీయ సినీరంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2024 మంగళవారం రాత్రి ముంబైలో కన్నుల పండుగగా జరిగింది. పలువురు సినీతారలు...

వేడుకగా దాదాసాహెబ్‌ ఫాల్కే  అవార్డుల ప్రదానం

భారతీయ సినీరంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2024 మంగళవారం రాత్రి ముంబైలో కన్నుల పండుగగా జరిగింది. పలువురు సినీతారలు ఈ చిత్రోత్సవంలో సందడి చేశారు. ‘యానిమల్‌’ చిత్రానికి గాను సందీప్‌రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడి పురస్కారం అందుకున్నారు. ఉత్తమ నటీనటులుగా ‘జవాన్‌’ చిత్రానికి షారూఖ్‌, నయనతార అవార్డు స్వీకరించారు. ఉత్తమ ప్రతినాయకుడిగా బాబీడియోల్‌, ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్‌ నిలిచారు. సంగీత ప్రపంచానికి అందించిన సేవలకు గాను యేసుదాస్‌ ప్రత్యేక పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా షారూఖ్‌ఖాన్‌ మాట్లాడుతూ ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అంటే నాకు చాలా గౌరవం. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఉత్తమ నటుడి పురస్కారం దక్కినందుకు ఆనందంగా ఉంది. ఈ అవార్డును నాతో పాటు పురస్కారాలకు నామినేట్‌ అయిన తోటి నటీనటులకు అంకితమిస్తున్నాను. ఇంత గొప్ప గౌరవం దక్కేలా చేసినందుకు ప్రేక్షకులకూ, జవాన్‌ చిత్రబృందానికి నా ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

Updated Date - Feb 22 , 2024 | 05:40 AM