దర్శక ధీరుడి సమర్పణలో...

ABN , Publish Date - Mar 20 , 2024 | 06:11 AM

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ నిర్మాతగా మారుతున్నారు. ప్రముఖ ఆర్కా మీడియా వర్క్స్‌ సంస్థ అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనితో కలసి కార్తికేయ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను...

దర్శక ధీరుడి సమర్పణలో...

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ నిర్మాతగా మారుతున్నారు. ప్రముఖ ఆర్కా మీడియా వర్క్స్‌ సంస్థ అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనితో కలసి కార్తికేయ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను రూపొందించనున్నారు. పాన్‌ ఇండియా డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమా, సినిమాకు ఎంచుకునే పాత్రల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించే మళయాళ నటుడు, ‘పుష్ప’ ఫేమ్‌ ఫహాద్‌ ఫాజిల్‌ ఈ రెండు చిత్రాల్లోనూ నటిస్తుండటం విశేషం. కార్తికేయ ఈ మధ్య తెలుగులో డిస్ట్రిబ్యూటర్‌గా విడుదల చేసిన ‘ప్రేమలు’ చిత్రానికి ఫహాద్‌ పాజిల్‌ కూడా ఓ నిర్మాత అనే సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లో ఒకటి ఫ్రెండ్‌ఫిప్‌ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘ఆక్సిజన్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. నూతన దర్శకుడు సిద్ధార్థ్‌ నాదెళ్ల దర్శకుడు. మరో చిత్రం ఫ్యాంటసీ కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రం టైటిల్‌ ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. శశాంక్‌ ఏలేటి దర్శకుడు. ఈ రెండు చిత్రాలకు వేటికవే భిన్నంగా, కంటెంట్‌ బేస్డ్‌గా తెరకెక్కనున్నాయి. ఈ సినిమాలను ప్రకటించిన సందర్భంగా కార్తీకేయ మాట్లాడుతూ ‘‘డిస్ర్టిబ్యూటర్‌గా నా తొలి చిత్రం ‘ప్రేమలు’ ద్వారా నాకు విజయాన్ని అందించి నాపై మీకున్న అపరిమితమైన ప్రేమను తెలియజేశారు. దీంతో మంచి చిత్రాలకు భాషాపరమైన భేదాలుండవనే నమ్మకం నాలో మరింతగా పెరిగింది. ఈ రెండు చిత్రాల్లో నటిస్తున్న ఫహాద్‌ ఫాజిల్‌ బహుముఖ ప్రజ్ఞకు ప్రతిరూపం, నేనెంతగానో ఆరాధించే వ్యక్తి’’ అని అన్నారు.

Updated Date - Mar 20 , 2024 | 06:11 AM