నవ్వించడానికి సిద్ధం

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:19 AM

‘అల్లరి’ నరేశ్‌ తన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’తో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రాజీవ్‌ చిలక నిర్మించారు...

నవ్వించడానికి సిద్ధం

‘అల్లరి’ నరేశ్‌ తన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’తో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రాజీవ్‌ చిలక నిర్మించారు. వేసవి సెలవుల సందర్బంగా ఈ నాన్‌స్టా్‌ప ఎంటర్‌టైనర్‌ను మే 3న విడుదల చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేస్తోంది. చాలా రోజుల తర్వాత మళ్లీ నరేశ్‌ పూర్తి స్థాయిలో ఫన్‌ క్యారెక్టర్‌ పోషించడంతో ఈ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రచన: అబ్బూరి రవి, సంగీతం: గోపీసుందర్‌, ఛాయాగ్రహణం: సూర్య, సహ నిర్మాత: భరత్‌ లక్ష్మీపతి.

Updated Date - Apr 16 , 2024 | 03:19 AM