సోలోగా అలరించేందుకు సిద్ధం

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:55 AM

వినూత్న ప్రేమకథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘సోలో బాయ్‌’. గౌతమ్‌ కృష్ణ హీరోగా పి. నవీన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సెవెన్‌హిల్స్‌ సతీశ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు...

సోలోగా అలరించేందుకు సిద్ధం

వినూత్న ప్రేమకథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘సోలో బాయ్‌’. గౌతమ్‌ కృష్ణ హీరోగా పి. నవీన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సెవెన్‌హిల్స్‌ సతీశ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తె చ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ‘మా నిర్మాత సింగిల్‌ సిట్టింగ్‌లో కథను ఓకే చేశారు. త్వరలో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘సోలో బాయ్‌’ చిన్న సినిమాయే అయినా, మంచి కథతో తెరకెక్కించాం. ప్రేక్షకులను మెప్పించేలా దర్శకుడు సినిమాను తీర్చిదిద్దాడు’ అని అన్నారు. పాటలు, ఫైట్స్‌ మా సినిమాకు ప్రత్యేకాకర్షణ అని దర్శకుడు తెలిపారు.

Updated Date - Apr 15 , 2024 | 12:55 AM