ఊచకోతకు సిద్ధం

ABN , Publish Date - Feb 07 , 2024 | 06:07 AM

‘అలాంటోడు మళ్లీ తిరిగొస్తున్నాడంటే...?’ ఎలా ఉండబోతోందో చూసేందుకు డేట్‌ ఖరారైంది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ‘ఓజీ’ చిత్రం విడుదల తేదీ అధికారికంగా ఖాయమైంది...

ఊచకోతకు సిద్ధం

‘అలాంటోడు మళ్లీ తిరిగొస్తున్నాడంటే...?’ ఎలా ఉండబోతోందో చూసేందుకు డేట్‌ ఖరారైంది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ‘ఓజీ’ చిత్రం విడుదల తేదీ అధికారికంగా ఖాయమైంది. సెప్టెంబర్‌ 27న ఈ చిత్రాన్ని విడుదలచేస్తున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మంగళవారం రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను వదిలింది. ఇందులో పవన్‌ కల్యాణ్‌ టీ గ్లాస్‌ పట్టుకొని స్టైలి్‌షగా కనిపించారు. ముంబై-జపాన్‌ బ్యాక్‌డ్రా్‌పలో గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘సాహో’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి. దానయ్య నిర్మాత. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. అర్జున్‌దా్‌స, శ్రియారెడ్డి, వెంకట్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Feb 07 , 2024 | 06:07 AM