సేనాపతి రాకకు సిద్ధం

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:04 AM

కమల్‌హాసన్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రం సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో ఆ చిత్రానికి...

సేనాపతి రాకకు సిద్ధం

కమల్‌హాసన్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రం సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ రూపొందుతోంది. సుభాస్కరన్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సేనాపతిగా కమల్‌హాసన్‌ సీరియస్‌ లుక్‌లో కనిపించారు. ‘తప్పును అస్సలు భరించలేను’ అని పోస్టర్‌పై రాసి ఉన్న వాక్యం సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌.జే సూర్య కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రవివర్మన్‌

Updated Date - Apr 08 , 2024 | 01:04 AM