Kalki 2898 AD : యుద్ధానికి సిద్ధం!

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:11 AM

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్‌ ఈ నెల 10న విడుదల కానుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌ అధినేత అశ్వనీదత్‌ ప్రతిష్ఠాత్మకంగా

Kalki 2898 AD : యుద్ధానికి సిద్ధం!

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్‌ ఈ నెల 10న విడుదల కానుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌ అధినేత అశ్వనీదత్‌ ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాలో అశ్వత్థామగా నటిస్తున్న అమితాబ్‌ బచ్చన్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. మధ్యప్రదేశ్‌లో నెమావార్‌లోని నర్మదా ఘాట్‌ దగ్గర ఏర్పాటు చేసిన ఓ మ్యాసివ్‌ ప్రొజెక్షన్‌ ద్వారా అమితాబ్‌ పాత్రను పరిచయం చేశారు. ఇప్పటికీ అశ్వత్థామ నర్మదా మైదానంలో నడుస్తాడనే నమ్మకం ఉండడంతో నర్మాదా ఘాట్‌లో అమితాబ్‌ లుక్‌ను విడుదల చేయం ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధభూమి మధ్యలో నిలబడి ఓ అస్త్రాన్ని పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు అమితాబ్‌ కనిపించారు. ఆయన నుదిటిపై ఉన్న రత్నం మెరుస్తోంది. ఆయన వెనుక ఓ భారీ వాహనం ఉంది, అలాగే ఆయన ముందు కొంతమంది వ్యక్తులు నేలపై పడి ఉన్నారు. ఈ నెల 27న విడుదల కానున్న ‘కల్కి’ చిత్రంలో కమల్‌హాసన్‌, దీపికా పదుకొణే, దిశా పటానీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Updated Date - Jun 08 , 2024 | 05:11 AM