ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధం...

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:59 AM

ఛోటా కే నాయుడుకు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ హెచ్చరిక ‘ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధం... మీ పిలుపు కోసం ఎదురుచూస్తుంటాను’ అంటూ సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కే నాయుడుకు...

ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధం...

ఛోటా కే నాయుడుకు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ హెచ్చరిక ‘ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధం... మీ పిలుపు కోసం ఎదురుచూస్తుంటాను’ అంటూ సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కే నాయుడుకు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ సవాల్‌ విసిరారు. పదే పదే తనను లక్ష్యంగా చేసుకొని విమర్శలకు దిగుతున్నారంటూ ఛోటా కే నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఓ లేఖను హరీశ్‌ శంకర్‌ విడుదల చేశారు. వయసులో పెద్దవారు అని గౌరవిస్తున్నానంటూనే ఆయన ఛోటాపై వ్యంగాస్త్రాలు సంధించారు. ‘‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ఫ్లాప్‌ అయినా ఆ నింద మీపై మోపలేదు. ఆ సినిమా తీసి పదేళ్లు దాటిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా పలు ఇంటర్వ్యూల్లో మీరు కావాలని పదే పదే నా ప్రస్తావన తెచ్చి అవమానిస్తున్నారు. మీపైన ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు భరించాను. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదూ కూడదు మళ్లీ కెలుక్కుంటాను అంటే ఎక్కడైనా, ఏ వేదికమీదైనా, నేను సిద్ధం’ అని హరీశ్‌ శంకర్‌ హెచ్చరించారు. ‘‘రామయ్యా వస్తావయ్యా’ షూట్‌లో కెమెరా డిపార్ట్‌మెంట్‌లో హరీశ్‌ శంకర్‌ జోక్యం చేసుకున్నారు. అది సబబు కాదని వారించినా ఆయన వినలేదు’’ అని ఛోటా కె నాయుడు విమర్శించడమే ఈ వివాదానికి కారణమైంది.

Updated Date - Apr 21 , 2024 | 05:00 AM