ఐదు భాషల్లో ‘ప్రేమించొద్దు’

ABN , Publish Date - May 17 , 2024 | 02:32 AM

బస్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ప్రేమించొద్దు’. అనురూప్‌ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రలు పోఫించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో...

ఐదు భాషల్లో ‘ప్రేమించొద్దు’

బస్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ప్రేమించొద్దు’. అనురూప్‌ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రలు పోఫించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంది. తెలుగు చిత్రం వచ్చే నెల 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం టీజర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత శిరిన్‌ శ్రీరామ్‌ మాట్లాడుతూ ‘ఐదు భాషల్లో సినిమా తీశాం. నాకు సహకరించిన టీమ్‌కు థాంక్స్‌’ అని చెప్పారు. చాలా ఎమోషనల్‌ ఫిల్మ్‌ ఇదనీ, ప్రతి తల్లితండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా అనీ సూపర్‌వైజింగ్‌ ప్రొడ్యూసర్‌ నిఖిలేశ్‌ చెప్పారు. హీరోగా తనకు ఇది మూడో చిత్రమనీ, మూడేళ్లు ఎన్నో కష్టాలు పడి శిరీన్‌ ఈ సినిమాను తీశారనీ అనురూ్‌పరెడ్డి చెప్పారు.

Updated Date - May 17 , 2024 | 02:32 AM