మళ్లీ వస్తున్న ప్రేమికుడు

ABN , Publish Date - Mar 12 , 2024 | 05:20 AM

ప్రభుదేవా కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వం వహించిన ‘ప్రేమికుడు’ చిత్రం అప్పట్లో సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే...

మళ్లీ వస్తున్న ప్రేమికుడు

ప్రభుదేవా కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వం వహించిన ‘ప్రేమికుడు’ చిత్రం అప్పట్లో సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపిన ఈ సినిమా ఈ తరాన్ని అలరించేందుకు త్వరలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని మరళీధర్‌ రెడ్డి, రమణ రీ రిలీజ్‌ చేస్తున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని వారు తెలిపారు.

Updated Date - Mar 12 , 2024 | 05:20 AM