ప్రేమకు జయం

ABN , Publish Date - Mar 12 , 2024 | 05:21 AM

సత్య మేరుగు, దీపిక జంటగా తెరకెక్కుతోన్న యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘జయం’. జి కిరణ్‌ కుమార్‌ దర్శకత్వంలో రవికుమార్‌ చౌదరి నిర్మిస్తున్నారు...

ప్రేమకు జయం

సత్య మేరుగు, దీపిక జంటగా తెరకెక్కుతోన్న యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘జయం’. జి కిరణ్‌ కుమార్‌ దర్శకత్వంలో రవికుమార్‌ చౌదరి నిర్మిస్తున్నారు. సోమవారం చిత్రబృందం పోస్టర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘గతంలో వచ్చిన ‘జయం’ి సనిమా టైటిల్‌ను మా సినిమాకు పెట్టాం. ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్‌ అవ్వాలి. కిరణ్‌ కుమార్‌ మంచి విజన్‌ ఉన్న దర్శకుడు’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కథకు తగ్గ నటులు టెక్నీషియన్లు దొరికారు. లవ్‌, యాక్షన్‌, ఎంటర్టైన్‌మెంట్‌ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గౌతమ్‌ రవిరామ్‌. సినిమాటోగ్రఫీ: యూఎస్‌ విజయ్‌

Updated Date - Mar 12 , 2024 | 05:21 AM