ప్రాణం గడ్డిపోస అనుకో..

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:50 AM

బాబీ సింహా, వేదిక, అనన్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్‌ దేశ్‌పాండే ముఖ్య పాత్రలు పోషించిన ‘రజాకార్‌’ చిత్రం త్వరలో విడుదల కానుంది. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడురు నారాయణరెడ్డి ఈ...

ప్రాణం గడ్డిపోస అనుకో..

బాబీ సింహా, వేదిక, అనన్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్‌ దేశ్‌పాండే ముఖ్య పాత్రలు పోషించిన ‘రజాకార్‌’ చిత్రం త్వరలో విడుదల కానుంది. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడురు నారాయణరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నుంచి ‘ప్రాణం గడ్డిపోస అనుకో..’ అనే పాటను విడుదల చేశారు. సుద్దాల అశోక్‌తేజ రాసిన ఈ పాటను శంకర్‌ మహదేవన్‌ పాడారు. బీమ్స్‌ సిసిరోలియో సంగీత దర్శకుడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘మా సినిమాలోని ఎమోషన్‌ను అర్థం చేసుకుని సుద్దాల అద్భుతంగా పాట రాశారు. మన పూర్వీకులను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తూ తీస్తున్న సినిమా’ అని చెప్పారు. ‘రజాకార్లను ఉద్దేశించి మాత్రమే ఈ సినిమా తీశాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చెప్పారు నిర్మాత.

Updated Date - Feb 06 , 2024 | 12:50 AM