Premikudu: నాటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ప్రేమికుడు.. రీ రిలీజ్

ABN , Publish Date - Mar 18 , 2024 | 06:20 PM

కేటి కుంజుమన్ నిర్మాతగా, ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా డాన్సర్, యాక్టర్ ప్రభుదేవ , నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ఈ సినిమా రీ రిలీజ్ ప్రెస్మీట్ సోమ‌వారం ఘనంగా జరిగింది.

Premikudu: నాటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ప్రేమికుడు.. రీ రిలీజ్
premikudu

కేటి కుంజుమన్ నిర్మాతగా, ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా డాన్సర్, యాక్టర్ ప్రభుదేవ (Prabhu Deva), అందాల నటి నగ్మ (Nagma) నటించిన ప్రేమికుడు (Premikudu) సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాల సుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా రీ రిలీజ్ ప్రెస్మీట్ సోమ‌వారం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, ట్రెజరర్ రామ్ సత్యనారాయణ, దర్శకుడు ముప్పలనేని శివ, శివనాగు నర్రా, శోభారాణి, నిర్మాతలు రమణ, మురళీధర్ పాల్గొన్నారు.

prem.jpeg

ఈ సందర్భంగా ముప్పలనేని శివ మాట్లాడుతూ.. 30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు (Premikudu) సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో ప్రభుదేవ (Prabhu Deva )ని చూసి స్ప్రింగ్ లు ఏమన్నా మింగాడా అనుకునే వాళ్లం. ఒక మంచి ప్రేమ కథగా సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరితో పాటు ఈ సినిమా ప్రేమికుడు (Premikudu) సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా అన్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా రీ రిలీజ్‌లో కూడా మంచి విజయం అందుకుంటుంది. ఇందులో గానగందర్వుడు బాలసుబ్రమణ్యం గారి నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవ నటన, డాన్సులు నగ్మ అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మా సోదరి సుధారాణి గారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.


దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. ఈ సినిమా ఈ తరంలో వచ్చుంటే కచ్చితంగా 100 కోట్లు కొట్టే సినిమా అయ్యేది. అప్పుడున్న బడ్జెట్ కి 3 కోట్లతో చేసిన సినిమా ఇప్పుడు ఉన్న కలెక్షన్లకి రీ రిలీజ్ లో 30 కోట్లు సాధిస్తుందని ఆశిస్తున్నా అన్నారు. ప్రభుదేవా (Prabhu Deva) డాన్సులు అలాగే బాలసుబ్రమణ్యం గారితో కూడా డాన్స్ వేయించడం ఈ సినిమాకి హైలెట్ అని. రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. నిర్మాతలు రమణ మరియు మురళీధర్ మాట్లాడుతూ..30 సంవత్సరాల క్రితం సెన్సేషన్ సృష్టించిన సినిమా మేము రీ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. అతి త్వరలో ఫ్రీ రిలీజ్డ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేయబోతున్నామ‌ని, ఈవెంట్ కి ప్రభుదేవా గారు కూడా హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నామ‌న్నారు. రీ రిలీజ్‌లో కూడా ప్రేమికుడు (Premikudu) సినిమా కలెక్షన్లు సృష్టిస్తుందని ఆశిస్తున్నామన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 06:20 PM