Kannappa: విష్ణు మంచు ‘కన్నప్ప’ కోసం.. రంగంలోకి ఇండియన్ మైఖెల్ జాక్సన్

ABN , Publish Date - Mar 04 , 2024 | 04:20 PM

డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ను ఇటీవలే ప్రారంభించారు. ఈ సినిమా కోసం ఇండియాలోని స్టార్ క్యాస్ట్, టాప్ టెక్నీషియన్స్ అంతా పని చేయనున్నారు. అయితే తాజాగా.. ఈ చిత్రం కోసం ఇండియన్ టాప్ కొరియెగ్రాఫర్, ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభు దేవా రంగంలోకి దిగారు.

Kannappa: విష్ణు మంచు ‘కన్నప్ప’ కోసం.. రంగంలోకి ఇండియన్ మైఖెల్ జాక్సన్
PRABHUDEVA

డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’(Kannappa) రెండో షెడ్యూల్‌ను ఇటీవలే ప్రారంభించారు. ఈ సినిమా కోసం ఇండియాలోని స్టార్ క్యాస్ట్, టాప్ టెక్నీషియన్స్ అంతా పని చేయనున్నారు. అయితే తాజాగా.. ఈ చిత్రం కోసం ఇండియన్ టాప్ కొరియెగ్రాఫర్, ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభు దేవా రంగంలోకి దిగారు. కన్నప్ప సినిమాలోని పాటలకు ప్రభు దేవా (Prabhudeva) కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ప్రభు దేవాకు చిత్ర యూనిట్ టీం స్వాగతం పలికింది. ప్రభుదేవా 'కన్నప్ప' సెట్స్‌లో జాయిన్ అవడంతో సినిమాకు మరో అస్సెట్ యాడ్ అయింది.

PDEVA.jpeg

కన్నప్ప రెండో షెడ్యూల్‌ న్యూజిలాండ్ (NewZealand)లో ప్రారంభమైందని మూవీ టీం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు.


విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు. మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ(24 Frames Factory), అవా ఎంటర్టైన్మెంట్స్(AVA Entertainment) బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 04:20 PM