మళ్లీ వస్తున్న ప్రభుదేవా ‘ప్రేమికుడు’

ABN , Publish Date - Mar 19 , 2024 | 03:47 AM

ప్రభుదేవా నగ్మా హీరోహీరోయిన్లుగా 30 ఏళ్ల క్రితం వచ్చిన మ్యూజికల్‌ బ్లాక్‌బస్టర్‌ ‘ప్రేమికుడు’ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. . టాప్‌ డైరెక్టర్‌ శంకర్‌ రెండో ప్రాజెక్ట్‌గా ఇది 1994లో...

మళ్లీ వస్తున్న ప్రభుదేవా ‘ప్రేమికుడు’

ప్రభుదేవా నగ్మా హీరోహీరోయిన్లుగా 30 ఏళ్ల క్రితం వచ్చిన మ్యూజికల్‌ బ్లాక్‌బస్టర్‌ ‘ప్రేమికుడు’ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. . టాప్‌ డైరెక్టర్‌ శంకర్‌ రెండో ప్రాజెక్ట్‌గా ఇది 1994లో రిలీజై ఆ తరం యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని కే.టి కుంజుమోన్‌ నిర్మించారు. ఏ. ఆర్‌. రెహమాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. గానగంధర్వుడు, స్వర్గీయ ఎస్‌. పీ. బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్‌, గిరీష్‌ కర్నాడ్‌ కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఈ సినిమా రీ రిలీజ్‌ రైట్స్‌ కొన్న నిర్మాతలు రమణ, మురళీధర్‌ సోమవారం ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు ముప్పలనేని శివ మాట్లాడుతూ ‘‘30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా ఇప్పుడు రీ రిలీజ్‌ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో ప్రభుదేవా డాన్సులు చూసి స్ర్పింగ్‌లు ఏమన్నా మింగారా అని అనుమానపడేవాళ్లం. అందరితోపాటు ఈ సినిమా కోసం నేనూ ఆతృతగా ఎదురు చూస్తున్నాను’’ అని అన్నారు. తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా రీ రిలీజ్‌లో కూడా సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుంది. ఇందులో గానగంధర్వుడు ఎస్‌. పి. బాలసుబ్రమణ్యం నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవా నటన, డాన్సులు నగ్మా అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ’’ అని చెప్పారు. రీ రిలీజ్‌ చేస్తున్న రమణ, మురళీధర్‌ మాట్లాడుతూ ‘‘30 ఏళ్ల క్రితం సెన్సేషన్‌ సృష్టించిన సినిమాను మేము రీ రిలీజ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలో ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించి, ప్రభుదేవాను ముఖ్య అతిఽథిగా పిలవాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.

Updated Date - Mar 19 , 2024 | 03:47 AM