పవర్‌ఫుల్‌ పోలీస్‌

ABN , Publish Date - Oct 16 , 2024 | 05:58 AM

తమిళ, కన్నడ భాషల్లో విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్‌’. గురుప్రసాద్‌ దర్శకుడు. లక్ష్మీ రాయ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు రైట్స్‌ని ఆర్కే ఫిల్మ్స్‌ దక్కించుకుంది..

తమిళ, కన్నడ భాషల్లో విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్‌’. గురుప్రసాద్‌ దర్శకుడు. లక్ష్మీ రాయ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు రైట్స్‌ని ఆర్కే ఫిల్మ్స్‌ దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆర్కే ఫిల్మ్స్‌ అధినేత, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ...‘ లక్ష్మీ రాయ్‌ పవర్‌ఫుల్‌ ఐపీఎస్‌ క్యారెక్టర్‌ పాత్రలో నటించారు. ఫైట్‌ మాస్టర్‌ థ్రిల్లర్‌ మంజు కంపోజ్‌ చేసిన ఎనిమిది ఫైట్స్‌ ఆమె కెరీర్‌లో నిలిచిపోతాయి. త్వరలో ట్రైలర్‌ను, నవంబరులో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’ అన్నారు.

Updated Date - Oct 16 , 2024 | 05:58 AM