విడుదల వాయిదా

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:16 AM

‘ఈ నెల ఏడున ‘జనక అయితే గనక’ సినిమాను విడుదల చేయాలనుకున్నాం.అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా వేస్తున్నాం. నవ్వుల వినోదం పండించే రోజుని...

‘ఈ నెల ఏడున ‘జనక అయితే గనక’ సినిమాను విడుదల చేయాలనుకున్నాం.అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా వేస్తున్నాం. నవ్వుల వినోదం పండించే రోజుని త్వరలో ప్రకటిస్తాం. ప్రేక్షకులు అందరూ థియేటర్లలో చూసి ఆస్వాదించాల్సిన సినిమా కనుక ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని వెల్లడించారు దిల్‌ రాజు. సుహాస్‌ హీరోగా రూపుదిద్దుకున్న ‘జనక అయితే గనక’ చిత్రానికి సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు. శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. హీరో సుహాస్‌ మాట్లాడుతూ ‘మూవీ ఫైనల్‌ వెర్షన్‌ చూశాను. చాలా బాగా నచ్చింది. అందుకే యుఎస్‌ఏ హక్కులు కొన్నాను. ప్రతి దానికీ లెక్కలు చెప్పే మిడిల్‌ క్లాస్‌ యువకుడిగా నటించా. దిల్‌ రాజుగారు ఎంతో సపోర్ట్‌ చేశారు’ అన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 03:17 AM