పోస్ట్‌మ్యాన్ సాహసాలు
ABN , Publish Date - Oct 26 , 2024 | 05:56 AM
కిరణ్ అబ్బవరం, నయన సారిక, తన్వీరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘క’. దర్శకద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించగా.. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు.
కిరణ్ అబ్బవరం, నయన సారిక, తన్వీరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘క’. దర్శకద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించగా.. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. ఈ నెల 31న సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో పోస్ట్‌మ్యాన్ వాసుదేవ్ పాత్రలో కనిపించనున్నారు కిరణ్ అబ్బవరం. ఉత్కంఠకు గురి చేసే సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కిరణ్ అబ్బవరం నటన, యాక్షన్ సన్నివేశాలు సినిమా మీద అంచనాలు పెంచుతున్నాయి. ఈ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ తెలిపారు.