షారూఖ్‌ను దాటిన పాపులారిటీ
ABN , Publish Date - Aug 14 , 2024 | 03:02 AM
ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసిన ఈ వారం అత్యంత ప్రజాధరణ పొందిన భారతీయ సెలబ్రిటీ జాబితాలో హీరోయిన్ శోభితా దూళిపాళ్ల పలువురు అగ్రతారలను వెనక్కునెట్టి...
ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసిన ఈ వారం అత్యంత ప్రజాధరణ పొందిన భారతీయ సెలబ్రిటీ జాబితాలో హీరోయిన్ శోభితా దూళిపాళ్ల పలువురు అగ్రతారలను వెనక్కునెట్టి, రెండో స్థానం దక్కించుకున్నారు. షారూఖ్‌ఖాన్ ఆమె తర్వాతి స్థానంలో నిలిచారు. శార్వరీ అగ్రస్థానంలో నిలవగా, జాన్వీకపూర్ ఐదోస్థానంలో నిలిచారు. ఇటీవలే నాగచైతన్యతో శోభిత నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలో నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునేందుకు ఎక్కువగా సెర్చ్ చేశారు.