విజయ్ 69లో భాగమైన పూజ.. మమితా
ABN, Publish Date - Oct 04 , 2024 | 01:23 AM
తమిళ నటుడు విజయ్, హెచ్.వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘విజయ్ 69’ అనేది వర్కింగ్ టైటిల్. విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు..
తమిళ నటుడు విజయ్, హెచ్.వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘విజయ్ 69’ అనేది వర్కింగ్ టైటిల్. విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు.. ఆయన నటించే ఆఖరి చిత్రం ఇదే కావడంతో సినిమాపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. బాబీ డియోల్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. తాజాగా, ఈ సినిమాలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, హీరోయిన్ పూజ హెగ్దే, మమితా బైజు భాగం అవుతున్నట్లు నిర్మాత వెంకట్.కె.నారాయణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమా వచ్చే ఏడాది అక్టోబరులో విడుదల కానుంది. కాగా, విజయ్ సరసన పూజ హెగ్దే ఇంతకుముందు ‘బీస్ట్’ చిత్రంలో నటించారు.